కొత్త దర్శకుడితో నయన్‌...

ABN , First Publish Date - 2020-10-08T11:04:01+05:30 IST

కథల ఎంపికలో ఆచితూచి అడుగేస్తారు నయనతార. స్టంట్‌ కొరియోగ్రాఫర్‌, షార్ట్‌ ఫిలింమేకర్‌ అయిన నవకాంత్‌ రాజ్‌కుమార్‌ చెప్పిన కథ నచ్చడంతో తాజాగా ఆమె ఓ...

కొత్త దర్శకుడితో నయన్‌...

కథల ఎంపికలో ఆచితూచి అడుగేస్తారు నయనతార. స్టంట్‌ కొరియోగ్రాఫర్‌, షార్ట్‌ ఫిలింమేకర్‌ అయిన నవకాంత్‌ రాజ్‌కుమార్‌ చెప్పిన కథ నచ్చడంతో తాజాగా ఆమె ఓ సినిమాకు సంతకం చేశారు. దర్శకుడిగా ఆయనకిది తొలి సినిమా. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ప్రస్తుతం నయనతార నటిస్తున్న ‘మూకుత్తి అమ్మన్‌’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే విజయ్‌సేతుపతి, సమంత జంటగా నయనతార ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘కాత్తువాకుల రెండు కాదల్‌’ చిత్రంలోనూ ఆమె కీలక పాత్రలో నటిస్తున్నారు.

Updated Date - 2020-10-08T11:04:01+05:30 IST