మాజీ ప్రియుడి పేరుని చెరిపేసుకున్న నయనతార
ABN , First Publish Date - 2020-04-16T02:16:19+05:30 IST
తన చేతిపై టాటూలా వేసుకున్న ప్రభుదేవా పేరుని నయనతార చెరిపేసుకుందట. ఇప్పుడు ఆ స్థానంలో పాజిటివిటీ అనే కొత్త టాటూ వేయించుకుంది. ఇప్పుడు ఆ ఫొటోలో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

దక్షిణాదిన అగ్ర తారగా రాణిస్తోన్న నయనతార కెరీర్ కొనసాగే క్రమంలో ముందు శింబుతో ప్రేమలో పడింది. తర్వాత వారిద్దరికీ బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవడమే మిగిలింది అనేంత గాఢంగా ప్రేమించుకున్నారు. ఆ సమయంలో ప్రభుదేవా పేరుని తన చేతిపై నయనతార పచ్చబొట్టుగా వేయించుకుంది. కానీ తర్వాత ప్రభుదేవాతో కూడా నయనతారకు చెడింది. ఇప్పుడు విఘ్నేశ్ శివన్‌తో నయన ప్రేమ వ్యవహారం కొనసాగిస్తుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఒకప్పుడు తన చేతిపై టాటూలా వేసుకున్న ప్రభుదేవా పేరుని నయనతార చెరిపేసుకుందట. ఇప్పుడు ఆ స్థానంలో పాజిటివిటీ అనే కొత్త టాటూ వేయించుకుంది. ఇప్పుడు ఆ ఫొటోలో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Read more