నయనతార 'అమ్మోరు తల్లి'

ABN , First Publish Date - 2020-10-25T20:40:52+05:30 IST

నయనతార ఆదిశక్తి అవతారమెత్తారు. బలమైన పాత్రలు, గ్లామర్‌తో అలరించిన ఆమె ‘మూక్కుత్తి అమ్మన్‌’ చిత్రంలో తొలిసారి దేవత పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో 'అమ్మోరుతల్లి'గా విడుదల చేస్తున్నారు.

నయనతార 'అమ్మోరు తల్లి'

నయనతార ఆదిశక్తి అవతారమెత్తారు. బలమైన పాత్రలు, గ్లామర్‌తో అలరించిన ఆమె ‘మూక్కుత్తి అమ్మన్‌’ చిత్రంలో తొలిసారి దేవత పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో 'అమ్మోరుతల్లి'గా విడుదల చేస్తున్నారు. ఆర్జే బాలాజీ, ఎన్‌జే శరవణన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా దీపావళి సందర్భంగా ఓటీటీ మాధ్యమంలో విడుదల కానుంది. దసరా సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. భక్తి పేరుతో మోసాలు చేసే కొందరి గురించి అసలు నిజాలు తెలియజేయడానికి అమ్మవారు భూమిపైకి వస్తే.. ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నట్లు ట్రైలర్‌ చూస్తేనే అర్థమవుతుంది. సినిమాలో కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉందని అర్థమవుతుంది. నటుడు అజయ్‌ ఘోష్‌ ఈ చిత్రంలో మెయిన్‌ విలన్‌ పాత్రలో కనిపిస్తున్నారు. మరి అమ్మోరు తల్లి తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూద్దాం. 
Updated Date - 2020-10-25T20:40:52+05:30 IST

Read more