నాచియార్ బయోపిక్‌లో నయన్
ABN , First Publish Date - 2020-12-30T06:05:05+05:30 IST
విభిన్నపాత్రలతో కథానాయికగా, వైవిధ్యమైన పాత్రలతో కథానాయిక ప్రాథాన్యచిత్రాలతో తారాపథంలో దూసుకుపోతున్నారు నయనతార. తాజాగా ఆమె టైటిల్ పాత్రలో...

విభిన్నపాత్రలతో కథానాయికగా, వైవిధ్యమైన పాత్రలతో కథానాయిక ప్రాథాన్యచిత్రాలతో తారాపథంలో దూసుకుపోతున్నారు నయనతార. తాజాగా ఆమె టైటిల్ పాత్రలో ఒకప్పటి మహారాణి వేలు నాచియర్ జీవిత కథను తెరకెక్కిస్తున్నారు. 1780-1790 మధ్యకాలంలో ఆమె శివగంగ ప్రాంతాన్ని పాలించారు. ఇండియాలో ఈస్టిండియా కంపెనీ మీద పోరాటం చేసిన తొలి రాణిగా ఆమె చరిత్రకెక్కారు. ‘తిరుట్టు పాయలే 2’ దర్శకుడు సుశీ జెన్సన్ ఈ చిత్రానికి దర్శకుడు. అయితే వేలు నాచియార్ జీవిత కథతో తమిళంలో మరో చిత్రం రూపుదిద్దుకోవడం విశేషం. 18 కె స్టూడియోస్ బ్యానర్‌పై రాజేంద్రన్ మణిమారన్ దర్శకత్వంలో ‘వీరమంగాయ్ వేలు నాచియార్’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. దీనికి పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రంలో టైటిల్ రోల్ కోసం ప్రముఖ హీరోయిన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు.