నవాజుద్దీన్‌పై అత్యాచారం కేసు పెట్టిన భార్య!

ABN , First Publish Date - 2020-09-24T03:03:35+05:30 IST

ఎన్నో బాలీవుడ్ చిత్రాల్లో నటించి విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ.

నవాజుద్దీన్‌పై అత్యాచారం కేసు పెట్టిన భార్య!

ఎన్నో బాలీవుడ్ చిత్రాల్లో నటించి విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. కొంతకాలంగా ఈయన వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నాడు. నవాజుద్దీన్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య ఆలియా కోర్టుకు ఎక్కింది. ఆ తర్వాత నవాజుద్దీన్‌ సోదరుడు,  కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. 


తాజాగా నవాజుద్దీన్‌పై ఆలియా అత్యాచారం, చీటింగ్ కేసులు పెట్టింది. ఈ మేరకు ఆమె వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన క్లయింట్ ఆలియా.. నవాజుద్దీన్‌పై అత్యాచారం, ఛీటింగ్ కేసుల పెట్టారని, వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారని ఆమె తరఫు లాయర్ ఓ ప్రకటన విడుదల చేశారు. 


Updated Date - 2020-09-24T03:03:35+05:30 IST