'అర్ధ శతాబ్దం'లో నవీన్ చంద్ర లుక్

ABN , First Publish Date - 2020-12-25T22:15:06+05:30 IST

'అర్ధ శతాబ్దం' సినిమాలో పోలీస్ ఆఫీసర్ గెటప్ లో ఉన్న నవీన్ చంద్ర లుక్ క్రిస్మస్ సందర్భంగా చిత్రయూనిట్ విడుదల చేసింది

'అర్ధ శతాబ్దం'లో నవీన్ చంద్ర లుక్

రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై  కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో, సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య నటిస్తోన్న  చిత్రం 'అర్ధ శతాబ్దం'. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిట్టి కిరణ్ రామోజు నిర్మిస్తున్నారు . ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ దశలో ఉంది. ఇటీవ‌ల ఈ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ను రానా విడుదల చేశారు.  క్రిస్మస్‌ సందర్భంగా శుక్రవారం సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తోన్న నవీన్ చంద్ర లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రవీంద్ర పుల్లే మాట్లాడుతూ "'అర్ధ శతాబ్దం' సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రంజిత్ పాత్రలో నవీన్ చంద్ర నటిస్తున్నారు. అందరినీ ఆలోచింపచేసే విధంగా ఈ మూవీ ఉంటుంది" అన్నారు. నిర్మాత చిట్టి కిరణ్ రామోజు మాట్లాడుతూ "సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. జనవరిలో టీజర్ విడుదల చేయబోతున్నాం. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది" అన్నారు. 

Updated Date - 2020-12-25T22:15:06+05:30 IST