సైకో వ‌ర్మ‌, దెయ్యంతో సహవాసం అంటోన్న నట్టి

ABN , First Publish Date - 2020-09-08T03:32:35+05:30 IST

నిర్మాత నట్టికుమార్‌ పుట్టినరోజు సెప్టెంబర్‌ 8. ఈ సందర్భంగా ఆయన తమ సంస్థలో నిర్మించబోతున్న

సైకో వ‌ర్మ‌, దెయ్యంతో సహవాసం అంటోన్న నట్టి

నిర్మాత నట్టికుమార్‌ పుట్టినరోజు సెప్టెంబర్‌ 8. ఈ సందర్భంగా ఆయన తమ సంస్థలో నిర్మించబోతున్న అలాగే ఆయన దర్శకత్వం వహించబోతోన్న చిత్రాల గురించి మీడియాకు తెలియజేశారు. రామ్‌ గోపాల్‌ వర్మతో కలిసి ఆయన సినిమాలు చేయబోతున్నట్లుగా తెలిపారు. అలాగే రెండు సినిమాలకు దర్శకత్వం వహించబోతున్నట్లుగా ప్రకటించారు.


ఆయన మాట్లాడుతూ.. ''మా సంస్థలో రూపుదిద్దుకోనున్న కొన్ని చిత్రాలను రాంగోపాల్ వర్మతో కలసి తీయబోతున్నాము. ఈ నెల 9న 'సైకో వ‌ర్మ‌' చిత్రం షూటింగును ప్రారంభిస్తాము. 'దెయ్యంతో స‌హ‌వాసం' అనే మరో చిత్రాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. ఈ రెండు చిత్రాలకు నేనే దర్శకత్వం వహిస్తున్నాను. ఇప్పటి వరకు 8 చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు, నిర్మాతగా 65 చిత్రాలు నిర్మించాను. నిర్మాత‌లుగా మా పిల్లలు ముందుకు వ‌చ్చి సినిమాలు చేస్తున్నారు. దిశ ఎన్‌కౌంట‌ర్ సినిమా ముగింపు ద‌శ‌కు వ‌చ్చింది. ఇంకా ఆరు సినిమాలు ర‌న్నింగ్‌లో ఉన్నాయి.." అని తెలిపారు.

Updated Date - 2020-09-08T03:32:35+05:30 IST