విజ‌య నిర్మ‌ల బ‌యోపిక్... అంతా పుకార్లేన‌న్న న‌రేష్‌

ABN , First Publish Date - 2020-04-28T17:56:29+05:30 IST

విజ‌య నిర్మ‌ల బ‌యోపిక్‌ను రూపొందించ‌డం లేద‌ని, ఆమె బ‌యోపిక్ కోసం ఎవ‌రికీ ప‌ర్మిష‌న్స్ ఇవ్వ‌లేద‌ని సీనియర్ నరేశ్ చెప్పేశారు.

విజ‌య నిర్మ‌ల బ‌యోపిక్... అంతా పుకార్లేన‌న్న న‌రేష్‌

సీనియ‌ర్ న‌టి, ద‌ర్శ‌కురాలు, గిన్నిస్‌బుక్ రికార్డ్ హోల్డ‌ర్ విజ‌య నిర్మ‌ల అనారోగ్యంతో గ‌త ఏడాదిలో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈమె బ‌యోపిక్‌ను రూపొందిస్తార‌ని, అందులో ‘మ‌హాన‌టి’ చిత్రంతో జాతీయ ఉత్త‌మ‌న‌టి అవార్డ్ అందుకున్న కీర్తి సురేశ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌పడ్డాయి. అయితే ఈ బయోపిక్ వార్త‌ల‌ను విజ‌య నిర్మల త‌న‌యుడు, న‌టుడు సీనియ‌ర్ న‌రేశ్ ఖండించారు. విజ‌య నిర్మ‌ల బ‌యోపిక్‌ను రూపొందించ‌డం లేద‌ని, ఆమె బ‌యోపిక్ కోసం ఎవ‌రికీ ప‌ర్మిష‌న్స్ ఇవ్వ‌లేద‌ని ఆయ‌న చెప్పేశారు. దీంతో విజ‌య నిర్మ‌ల బ‌యోపిక్‌పై వ‌స్తున్న వార్త‌ల‌కు చెక్ ప‌డింది. 

Updated Date - 2020-04-28T17:56:29+05:30 IST