నారప్ప షురూ!

ABN , First Publish Date - 2020-11-06T10:06:00+05:30 IST

వెంకటేశ్‌ కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ‘నారప్ప’ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో పునఃపారంభమైంది...

నారప్ప షురూ!

వెంకటేశ్‌ కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ‘నారప్ప’ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో పునఃపారంభమైంది. డి.సురేశ్‌బాబు, కలైపులి ఎస్‌.థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి సుందరమ్మగా కీలక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘అనంతపురంలోని పాల్తూరు గ్రామంలో ‘నారప్ప’ షూటింగ్‌ ప్రారభింంచాం. కురుమలై, తిరిచందూర్‌ సమీపంలో యాక్షన్‌ సన్నివేశాలు షూట్‌ చేశాం.  లాక్‌డౌన్‌ సడలింపుతో తిరిగి చిత్రీకరణ మొదలుపెట్టాం. ప్రియమణి, రావు రమేశ్‌, రాజీవ్‌ కనకాల తదితరులపై కీలక సన్నివేశాలు, క్లైమాక్స్‌ చిత్రీకరిస్తున్నాం. దీనితో 80 శాతం షూటింగ్‌ పూర్తవుతుంది. మిగిలిన ఫ్లాష్‌ బ్యాక్‌ సన్నివేశాలు పూర్తిచేసి త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని అన్నారు. 

Updated Date - 2020-11-06T10:06:00+05:30 IST