నాన్నా... నవ్వుతోంది!

ABN , First Publish Date - 2020-07-27T12:14:13+05:30 IST

‘నాన్నా... (అమ్మాయి) నవ్వుతోంది! నేను (తాళి) కట్టలేను నాన్నా!’ అని పెళ్లికి కొన్ని క్షణాల ముందు నితిన్‌ తలపట్టుకుని బాధపడ్డారు. అంతకు ముందు ఏడ్చారు...

నాన్నా... నవ్వుతోంది!

‘నాన్నా... (అమ్మాయి) నవ్వుతోంది! నేను (తాళి) కట్టలేను నాన్నా!’ అని పెళ్లికి కొన్ని క్షణాల ముందు నితిన్‌ తలపట్టుకుని బాధపడ్డారు. అంతకు ముందు ఏడ్చారు కూడా! అయితే, అది నిజ జీవితంలో కాదు... ‘రంగ్‌ దే’లోని ఓ దృశ్యంలో! నితిన్‌, కీర్తీ సురేశ్‌ జంటగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్‌ దే’. వెంకీ అట్లూరి దర్శకుడు. పీడీవీ ప్రసాద్‌ సమర్పకులు. నితిన్‌ పెళ్లి సందర్భంగా ఆదివారం సినిమా టీజర్‌ విడుదల చేశారు. అందులో సరదా సంభాషణలు, టీజర్‌ చివర్లో పెళ్లి తర్వాత నేపథ్య సంగీతంలో వచ్చే ‘బతుకు బస్టాండే...’ సంగీతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ‘‘మా హీరో నితిన్‌కి అందమైన పెళ్లి బహుమతి ఇది. ప్రేమతో కూడిన ఈ కుటుంబ కథా చిత్రం అందరికీ నచ్చుతుంది’’ అని ‘రంగ్‌ దే’ టీమ్‌ పేర్కొంది.  


Updated Date - 2020-07-27T12:14:13+05:30 IST

Read more