నాని జోడీగా నజ్రియా

ABN , First Publish Date - 2020-11-14T05:11:37+05:30 IST

నాని అభిమానులకు దీపావళి ఒకరోజు ముందే వచ్చింది. ఆయన తాజా చిత్రానికి సంబంధించిన ప్రకటన శుక్రవారం విడుదలైంది. నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది...

నాని జోడీగా నజ్రియా

నాని అభిమానులకు దీపావళి ఒకరోజు ముందే వచ్చింది. ఆయన తాజా చిత్రానికి సంబంధించిన ప్రకటన శుక్రవారం విడుదలైంది. నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఈ సినిమాతో నానీకి జోడీగా మల్లూబ్యూటీ నజ్రియా ఫహాద్‌ తెలుగు తెరకు పరిచయం కానున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. బ్యాగ్రౌండ్‌లో గమ్యం చేరుకోవడానికి వెళ్తున్న విమానం, ఒక వీణ, కెమెరాలు, ట్రావెలింగ్‌ బ్యాగ్‌ను చూస్తుంటే చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా అనిపిస్తుంది. ఈ నెల 21న టైటిల్‌ ప్రకటిస్తామని నిర్మాతలు చెప్పారు.

Updated Date - 2020-11-14T05:11:37+05:30 IST