`వి` ప్రమోషన్స్‌తో నాని బిజీ!
ABN , First Publish Date - 2020-08-25T22:28:26+05:30 IST
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందించిన చిత్రం `వి`

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందించిన చిత్రం `వి`. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదల కాబోతోంది. సెప్టెంబర్ 5 నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఓటీటీలో విడుదలవుతున్న తొలి భారీ తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.
విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో `వి` చిత్రబృందం ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. సోషల్ మీడియా ద్వారా నాని ఈ సినిమా భారీగా ప్రమోట్ చేస్తున్నాడు. `వి` సినిమాకు సంబంధించిన విశేషాలను ట్విటర్ ద్వారా పంచుకుంటున్నాడు. ఇక, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితీరావు హైదరీ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు.
Read more