నందిత శ్వేతా ‘ఐపీసీ 376’ ట్రైలర్ విడుదల

ABN , First Publish Date - 2020-07-03T00:11:11+05:30 IST

పవర్ కింగ్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.ప్రభాకర్ సమర్పణలో హీరోయిన్ నందిత శ్వేతా ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం ‘ఐపీసీ 376’. రాజ్ కుమార్ సుబ్రమన్ దర్శకత్వం వహించిన

నందిత శ్వేతా ‘ఐపీసీ 376’ ట్రైలర్ విడుదల

పవర్ కింగ్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.ప్రభాకర్ సమర్పణలో హీరోయిన్ నందిత శ్వేతా ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం ‘ఐపీసీ 376’. రాజ్ కుమార్ సుబ్రమన్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్‌ను సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ విడుదల చేశారు. ఒక బంగ్లాలో జరిగే అనూహ్య ఘటనలు పోలీసులకు సవాల్ విసురుతాయి. ఆధునిక యుగంలో సైన్స్ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుందంటూ చెబుతూనే, అటు అతీంద్రియ శక్తుల ఉనికిని విజువల్స్‌లో చూపించారు. రేప్ చేస్తారు, ప్రాణాలతో తగలబెడతారు, అమ్మాయిలను బతకనివ్వరా అంటూ నందిత శ్వేతా చెప్పిన ఎమోషనల్ పవర్ ఫుల్ డైలాగ్‌తో ఐపీసీ 376 ట్రైలర్ ఆసక్తికరంగా ముగిసింది. 


ట్రైలర్‌లోని వివిధ ఇంట్రెస్టింగ్ షాట్స్ చిత్ర కథ గత థ్రిల్లర్ సినిమాలకు భిన్నమైన నేపథ్యంతో ఉందని తెలుపుతున్నాయి. పోలీస్ అధికారి పాత్రలో నందిత శ్వేత ఫుల్ స్వింగ్‌లో నటించిందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. యాదవ్ రామలిక్కమ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు సి.కళాధర్ సాహిత్యం అందిస్తున్నారు. తెలుగు మరియు తమిళ్ బైలింగ్వల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్‌కి రెడీగా ఉంది.

Updated Date - 2020-07-03T00:11:11+05:30 IST