‘కోతి కొమ్మచ్చి’లో...ప్రత్యేక గీతంతో!

ABN , First Publish Date - 2020-11-17T11:21:57+05:30 IST

‘బిగ్‌ బాస్‌ 2’ ఫేమ్‌ నందినీ రాయ్‌ ప్రత్యేక గీతంలో సందడి చేయబోతున్నారా? అంటే... ‘అవును’ అనే సమాధానం ‘కోతి కొమ్మచ్చి’ చిత్రవర్గాల నుంచి వినపడుతోంది. మేఘాంశ్‌ శ్రీహరి, సమీర్‌ వేగేశ్న హీరోలుగా నటిస్తున్న చిత్రమిది

‘కోతి కొమ్మచ్చి’లో...ప్రత్యేక గీతంతో!

‘బిగ్‌ బాస్‌ 2’ ఫేమ్‌ నందినీ రాయ్‌ ప్రత్యేక గీతంలో సందడి చేయబోతున్నారా? అంటే... ‘అవును’ అనే సమాధానం ‘కోతి కొమ్మచ్చి’ చిత్రవర్గాల నుంచి వినపడుతోంది. మేఘాంశ్‌ శ్రీహరి, సమీర్‌ వేగేశ్న హీరోలుగా నటిస్తున్న చిత్రమిది. మేఘనా చౌదరి, రిద్ధీ కుమార్‌ హీరోయిన్లు. వేగేశ్న సతీశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కోతి కొమ్మచ్చి’ కోసం సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ మాంచి మాస్‌ బీటున్న పాట స్వరపరిచారనీ, ప్రస్తుతం అమలాపురం పరిసర ప్రాంతాల్లో నందినీ రాయ్‌తో పాటు హీరోల మీద ప్రత్యేక గీతాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది. యువతను ఉర్రూతలూగించేలా ఉంటుందట. ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘సిల్లో ఫెలోస్‌’ చిత్రాల్లో నందినీ రాయ్‌ కథానాయికగా నటించారు. ఇటీవల ఓటీటీ చిత్రం ‘మెట్రో కథలు’లో మెరిశారు. ‘షూట్‌ అవుట్‌ ఎట్‌ ఆలేరు’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే... ప్రత్యేక గీతం చేయడం మాత్రం ఇదే మొదటిసారి.

Updated Date - 2020-11-17T11:21:57+05:30 IST