ఈ రూమర్‌కు నా రేటింగ్ 1/5: నందిని

ABN , First Publish Date - 2020-04-16T15:14:46+05:30 IST

సమంతతో దర్శకరాలు నందినీరెడ్డి మరోసారి పనిచేయబోతున్నారని, ఇది ఓ కొరియన్ సినిమాకు రీమేక్ అని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ రూమర్‌కు నా రేటింగ్ 1/5: నందిని

సమంతతో డైరెక్టర్ నందినీరెడ్డి మరోసారి పనిచేయబోతున్నారని, ఇది ఓ కొరియన్ సినిమాకు రీమేక్ అని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్‌పై నందిని తాజాగా తనదైన శైలిలో స్పందించారు. ఈ రూమర్‌కు 1/5 రేటింగ్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. 


`నా తరవాత సినిమా రీమేక్ కాదు. అది ఒరిజినల్ స్క్రిప్ట్. స్వప్న సినిమా బ్యానర్ నిర్మిస్తోంది. ఒకవేళ సమంతతో సినిమా చేస్తే నేనే చాలా గర్వంగా ప్రకటిస్తా. ఇప్పుడు, మరో రూమర్‌కు టైమ్ వచ్చింది. ఈ రూమర్‌కు నా రేటింగ్ 1/5. నిరుత్సాహపడొద్దు.. మీరింకా బాగా రూమర్లు సృష్టించగలరు` అని నందని ట్వీట్ చేశారు. నందిని ప్రస్తుతం వెబ్‌సిరీస్‌పై దృష్టి పెట్టినట్టు సమాచారం. 

Updated Date - 2020-04-16T15:14:46+05:30 IST

Read more