హీరోయిన్ల ఇష్టాయిష్టాలతోనే క్యాస్టింగ్‌ కౌచ్‌: హీరోయిన్

ABN , First Publish Date - 2020-05-25T01:22:00+05:30 IST

క్యాస్టింగ్ కౌచ్ అనేది హీరోయిన్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని అంటుంది హీరోయిన్ నందినీ రాయ్. మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, మాయ’’ వంటి చిత్రాలలో

హీరోయిన్ల ఇష్టాయిష్టాలతోనే క్యాస్టింగ్‌ కౌచ్‌: హీరోయిన్

క్యాస్టింగ్ కౌచ్ అనేది హీరోయిన్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని అంటుంది హీరోయిన్ నందినీ రాయ్. మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, మాయ’’ వంటి చిత్రాలలో నటించిన నందినీ రాయ్ ‘బిగ్ బాస్’ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయమైంది. తాజాగా ఈ అమ్మడు నెటిజన్లు అడిగిన అనేక ప్రశ్నలకు జవాబిచ్చింది. అందులో ముఖ్యంగా తను కోల్పోయిన సినిమాలను, క్యాస్టింగ్ కౌచ్ వంటి విషయాల గురించి సంచలన విషయాలను బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ..


కోల్పోయిన సినిమాలు:

‘‘అడవి శేష్ హీరోగా నటించిన ‘క్షణం’ చిత్రంలోని ఆదాశర్మ చేసిన పాత్ర ముందుగా నా దగ్గరకే వచ్చింది. ‘హయ్యర్ స్టడీస్’ నిమిత్తం ఆ పాత్రను వదులుకున్నాను. ఆ తర్వాత ఆ పాత్ర వదులుకున్నందుకు ఎంతగానో బాధపడ్డాను. అలాగే అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘ఒక్క క్షణం’ చిత్రంలోని శీరత్ కపూర్ పాత్ర కూడా నేను చేయాల్సిందే. ఆ పాత్రను కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకోవాల్సి వచ్చింది’’.  


క్యాస్టింగ్ కౌచ్: అమ్మాయిలకు ఇష్టం ఉంటేనే అది సాధ్యం

‘‘సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రతి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది సహజం. ఏ రంగంలో అయినా.. అమ్మాయిలు ఇచ్చే సమాధానం మీదే ఇది ఆధారపడి ఉంటుంది. అమ్మాయి లేదా హీరోయిన్ ఎవరైనా సరే.. ‘నో’ అని చెబితే ఎవరూ ఏం చేయలేరు. ఈ విషయంలో ఎవరూ ఎవరినీ ఫోర్స్ చేయరు. నా కెప్పుడూ ఇలాంటివి అనుభవాలు ఎదురవ్వలేదు కానీ దీనికి సంబంధించి చాలా దగ్గరగా ఎన్నో సంఘటనలను చూశాను. అయితే కేవలం హీరోయిన్ల పేరే దీనికి వినిపిస్తుంది. మెడికల్ సీట్స్ కోసం, పోలీస్ జాబ్స్ కోసం, ఐటీ కంపెనీలలో ఇలా అన్ని చోట్లా క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అంతేందుకు నాకు తెలిసిన ఐటీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్లు చెప్పే కొన్ని విషయాలు విన్నప్పుడు సినిమా ఇండస్ట్రీనే చాలా బెటర్ అనిపించింది. సో.. నేను చెప్పేది ఏమిటంటే ఏదైనా ఈ విషయంలో అమ్మాయి తీసుకునే డెసిషన్‌పైనే ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఆధారపడి ఉంటుందనేది నా అభిప్రాయం..’’ అని నందిని చెప్పుకొచ్చింది.

Updated Date - 2020-05-25T01:22:00+05:30 IST