పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌ అంటున్న నమ్రత

ABN , First Publish Date - 2020-11-04T00:38:32+05:30 IST

తాజాగా నమత్ర శిరోద్కర్‌ షేర్‌ చేసిన ఓ పెళ్లి ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో రెండు ఫొటోలున్నాయి.

పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌ అంటున్న నమ్రత

సూపర్‌స్టార్‌ మహేశ్‌ సతీమణి, ఒకప్పటి హీరోయిన్‌ నమ్రతా శిరోద్కర్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఫొటోలను, వీడియోలను షేర్‌ చేస్తూ మహేశ్‌ అండ్‌ ఫ్యామిలీకి సంబంధించిన వివరాలను వెల్లడిస్తుంటారు. తాజాగా నమత్ర శిరోద్కర్‌ షేర్‌ చేసిన ఓ పెళ్లి ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో రెండు ఫొటోలున్నాయి. ఓ ఫొటోలో మహేశ్‌, నమ్రత జంట ఉంటే, మరో ఫొటోలో నమత్ర తల్లిదండ్రులున్నట్లు అనిపిస్తుంది. రెండో ఫొటో గురించి నమ్రత పెద్దగా స్పందించలేదు. కానీ.. పిక్చర్ పర్‌ఫెక్ట్‌ అంటూ నమ్రత చేసిన పోస్ట్‌కు మాత్రం సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తుంది. మహేశ్‌ సోదరి మంజుల, నమ్రత సోదరి శిల్ప ఈ ఫొటో నిజంగానే పర్‌ఫెక్ట్ అంటూ కామెంట్‌ పెట్టారు. నెటిజన్స్‌ కూడా ఫొటో బావుందని మెచ్చుకుంటున్నారు. 
Updated Date - 2020-11-04T00:38:32+05:30 IST

Read more