ఆర్జీవీ 'మర్డర్‌' చిత్రానికి లైన్‌ క్లియర్‌

ABN , First Publish Date - 2020-11-06T17:49:11+05:30 IST

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రూపొందిస్తోన్న చిత్రం 'మర్డర్‌'. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం రేపిన ప్రణయ్‌ హత్య కేసు ఆధారంగా ఈ సినిమాను ఆర్జీవీ తెరకెక్కిస్తున్నారు.

ఆర్జీవీ 'మర్డర్‌' చిత్రానికి లైన్‌ క్లియర్‌

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రూపొందిస్తోన్న చిత్రం 'మర్డర్‌'. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం రేపిన ప్రణయ్‌ హత్య కేసు ఆధారంగా ఈ సినిమాను ఆర్జీవీ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ప్రణయ్‌ భార్య అమృత సినిమాను నిలిపివేయాలని పిటిషన్‌ వేయగా, నల్గొండ కోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. ఎట్టలకేలకు శుక్రవారం కోర్టు ఈ స్టేను కొట్టేసింది. మారుతీరావు, అమృత, ప్రణయ్‌ ఫొటోలు వాడకుండా సినిమాను విడుదల చేసుకోవచ్చునని కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు పట్ల ఆర్జీవీ ట్విట్టర్‌ ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేశారు. కోర్టు తన సినిమా తెరకెక్కిస్తున్న తీరుని అర్థం చేసుకుందని ఈ సందర్భంగా వర్మ పేర్కొన్నారు. నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు.  దీనికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు.


Updated Date - 2020-11-06T17:49:11+05:30 IST