కండల వీరుడీ విలుకాడు

ABN , First Publish Date - 2020-07-28T05:51:39+05:30 IST

ఆరు పలకల దేహం... ఒంటిపై గాయం... కళ్ళల్లో గురి తప్పకూడదనే ఆశయం... చేతిలో బాణం... లక్ష్యాన్ని ఛేదించే ఈతరం అర్జునుడిలా, నయా లుక్‌లో విలుకాడిలా నాగశౌర్య ప్రేక్షకుల ముందుకొచ్చాడు...

కండల వీరుడీ విలుకాడు

ఆరు పలకల దేహం... ఒంటిపై గాయం... కళ్ళల్లో గురి తప్పకూడదనే ఆశయం... చేతిలో బాణం... లక్ష్యాన్ని ఛేదించే ఈతరం అర్జునుడిలా, నయా లుక్‌లో విలుకాడిలా నాగశౌర్య ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అతడు హీరోగా నారాయణదాస్‌ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సంతోష్‌ జాగర్లమూడి దర్శకుడు. విలువిద్య నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం నాగశౌర్యకి 20వది. ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు. సోమవారం తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు, చిత్రనిర్మాతలలో ఒకరైన నారాయణదాస్‌ కె. నారంగ్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో నాగశౌర్య ఫస్ట్‌లుక్‌ను శేఖర్‌ కమ్ముల విడుదల చేశారు. ‘‘పక్కింటి కుర్రాడి తరహా పాత్రలు చేస్తూ కూల్‌ ఇమేజ్‌ నుంచి మాస్‌ ఇమేజ్‌కి నాగశౌర్య మారడం రైట్‌ ఛాయిస్‌ అనుకుంటున్నా. కమిట్‌మెంట్‌తో తన లుక్‌ మార్చుకున్న అతణ్ణి అభినందిస్తున్నా. నేను ‘ఛలో’, ‘ఓ బేబీ’ చిత్రాలు చూశా. వాటిలో నాగశౌర్య నటన నచ్చింది. తను ఎంపిక చేసుకుంటున్న కథలు బావుంటున్నాయి’’ అని అన్నారు. కేతికా శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ స్వరకర్త.


Updated Date - 2020-07-28T05:51:39+05:30 IST