నాగశౌర్య ‘లక్ష్య’
ABN , First Publish Date - 2020-12-01T06:44:37+05:30 IST
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ‘లక్ష్య’ టైటిల్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం...

నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ‘లక్ష్య’ టైటిల్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్‌గా కథానాయిక. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో అన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమా తెరకెక్కుతుంది. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ : రామ్‌రెడ్డి, సంగీతం: కాలబైరవ.