పునః ప్రారంభమైన నాగ శౌర్య, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ చిత్రం

ABN , First Publish Date - 2020-10-12T19:51:29+05:30 IST

సితార ఎంటర్ టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం నేడు హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది.

పునః ప్రారంభమైన నాగ శౌర్య, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ చిత్రం

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం నేడు హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది. ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ తో షూటింగ్ ప్రారంభించినట్లు మేకర్స్‌ తెలిపారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ చిత్రంలోనదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్,ప్రవీణ్,అనంత్,కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు నాగశౌర్య స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీలోనూ నటిస్తున్నారు. 


Updated Date - 2020-10-12T19:51:29+05:30 IST

Read more