హిమాలయాల నుంచి ఇంటికొస్తున్నా! నాగార్జున

ABN , First Publish Date - 2020-11-06T05:30:00+05:30 IST

‘‘హిమాలయాలకు, ప్రతిభావంతులు కల ‘వైల్డ్‌ డాగ్‌’ చిత్రబృందానికి వీడ్కోలు పలకడం బాధగా ఉన్నది. చిత్రంలో నా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి కావడంతో ఇంటికి బయలుదేరా’’ అని శుక్రవారం ఉదయం నాగార్జున ట్వీట్‌ చేశారు....

హిమాలయాల నుంచి ఇంటికొస్తున్నా! నాగార్జున

‘‘హిమాలయాలకు, ప్రతిభావంతులు కల ‘వైల్డ్‌ డాగ్‌’ చిత్రబృందానికి వీడ్కోలు పలకడం బాధగా ఉన్నది. చిత్రంలో నా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి కావడంతో ఇంటికి బయలుదేరా’’ అని శుక్రవారం ఉదయం నాగార్జున ట్వీట్‌ చేశారు. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో ఏసీపీ విజయ్‌ వర్మగా పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో ఆయన నటిస్తున్న సినిమా ‘వైల్డ్‌ డాగ్‌’. కీలక సన్నివేశాల చిత్రీకరణకు కొన్ని రోజుల క్రితం మనాలీలోని హిమాలయ పర్వత శ్రేణుల వద్దకు వెళ్లిన సంగతి తెలిసిందే.


ఈ షెడ్యూల్‌లో నాగార్జున పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ముగియడంతో ఆయన హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్‌ చేసిన ఫొటోల్లో నటీనటులు సయామీ ఖేర్‌, అలీ రేజా తదితరులు ఉన్నారు. స్వల్ప విరామం తర్వాత హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ చిత్రీకరణలో పాల్గొనడానికి నాగార్జున ముంబై వెళ్లనున్నట్టు సమాచారం. అందులో ఆయన ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.Updated Date - 2020-11-06T05:30:00+05:30 IST