ఆ పాట‌కు పాతికేళ్లు.. నాగ్ ట్వీట్‌

ABN , First Publish Date - 2020-05-13T18:11:36+05:30 IST

నాగార్జున‌, మ‌నీషా కొయిరాలా, ర‌మ్య‌కృష్ణ న‌టించిన చిత్రం ‘క్రిమిన‌ల్‌’. ఈ సినిమా విడుద‌లై పాతికేళ్లు అవుతుంది. మ‌హేశ్ భ‌ట్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైంది.

ఆ పాట‌కు పాతికేళ్లు.. నాగ్ ట్వీట్‌

నాగార్జున‌, మ‌నీషా కొయిరాలా, ర‌మ్య‌కృష్ణ న‌టించిన చిత్రం ‘క్రిమిన‌ల్‌’. ఈ సినిమా విడుద‌లై పాతికేళ్లు అవుతుంది. మ‌హేశ్ భ‌ట్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైంది. సినిమాలోని పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చాయి. ముఖ్యంగా ‘తెలుసా మ‌న‌సా..’ ఎవ‌ర్‌గ్రీన్ హిట్ సాంగ్‌గా నిలిచింది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీర‌వాణి సంగీతం అందించ‌గా బాలు చిత్ర ఆ పాట‌ను పాడారు. సినిమా విడుద‌లై పాతికేళ్లు అవుతున్న సంద‌ర్భంగా అనూప్ శంక‌ర్ ఈ పాట‌ను తెలుగు, హిందీ భాష‌ల్లో పాడి నిస్వార్ధంగా స‌మాజానికి సేవ చేస్తున్న హృద‌యాల‌కు అంకిత‌మిస్తున్న‌ట్లు తెలిపారు. దీనిపై హీరో నాగార్జున కూడా స్పందించారు. పాతికేళ్లు పూర్తి చేసుకున్న పాట‌ను నిస్వార్ధంగా సేవ చేస్తున్న వారికి అంకిత‌మివ్వ‌డం ఆనందంగా ఉంద‌ని ఆయ‌న తెలిపారు. Updated Date - 2020-05-13T18:11:36+05:30 IST