అందరికీ ధన్యవాదాలు: నాగార్జున!

ABN , First Publish Date - 2020-06-12T22:06:21+05:30 IST

`కింగ్` నాగార్జున, అమల తాజాగా తమ 28వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు

అందరికీ ధన్యవాదాలు: నాగార్జున!

`కింగ్` నాగార్జున, అమల తాజాగా తమ 28వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, టాలీవుడ్ సెలబ్రిటీలు నాగ్, అమలకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశారు. వీరందరికి నాగార్జున ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. 


`ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నాకు విషెస్ తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు. అందరూ క్షేమంగా ఉండండ`ని నాగార్జున ట్వీట్ చేశారు. అమలతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. నాగార్జున, తమిళ హీరో ధనుష్ త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ధనుష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషించబోతున్నారట. త్వరలో ఈ సినిమా గురించి ప్రకటన రాబోతోందట.
Updated Date - 2020-06-12T22:06:21+05:30 IST