తొమ్మిదేళ్ల ముందు నాగ్ సినిమా ఇప్పుడు తమిళంలో రిలీజ్
ABN , First Publish Date - 2020-12-21T22:07:02+05:30 IST
'రాజన్న' చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.

తొమ్మిదేళ్ల క్రితం నాగార్జున, స్నేహ జంటగా నటించిన ‘రాజన్న’ తెలుగు చిత్రం ఇప్పుడు తమిళంలో విడుదల కానుంది. రాజన్న అనే తెలంగాణ ప్రాంతానికి చెందిన విప్లవ వీరుడుగా నాగార్జున నటన ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఈ సినిమాను ‘రాజసింగమ్’ పేరుతో లక్ష్మీ లోటస్ మూవీమేకర్స్ బ్యానర్‌పై ఎస్‌జీఆర్ ప్రసాద్ అనువదించారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని ఆయన చెప్పారు.చారిత్రక కథలతో నిర్మించే చిత్రాలు తమిళ నాట విజయవంతమవుతున్నాయని, ఆ కోవలోనే ఈ చిత్రం కూడా హిట్ అవుతుందని భావిస్తున్నట్టు నిర్మాత ఎస్‌ఆర్‌జీ ప్రసాద్ వివరించారు.
Read more