`శివమణి` ఇప్పుడు వచ్చుంటే డైలాగ్స్ ఇలా ఉండేవి: నాగార్జున

ABN , First Publish Date - 2020-04-25T19:27:29+05:30 IST

`కింగ్` నాగార్జున, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా `శివమణి`.

`శివమణి` ఇప్పుడు వచ్చుంటే డైలాగ్స్ ఇలా ఉండేవి: నాగార్జున

`కింగ్` నాగార్జున, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా `శివమణి`. దాదాపు 17 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం ఘనవిజయంగా నిలిచింది. పోలీస్ అధికారిగా కనిపించిన నాగార్జున స్టైల్, పూరీ జగన్నాథ్ రాసిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 


తాజాగా కరోనా నేపథ్యంలో ఆ సినిమాలోని ఓ సీన్‌ను నాగార్జున తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితికి తగినట్టుగా ఆ సీన్లోని డైలాగ్స్‌ను మార్చి భవిరి రవి మిమిక్రీతో రూపొందించిన ఆ వీడియోను నాగ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ``శివమణి` సినిమా ఇప్పుడు వచ్చుంటే.. పూరీ జగన్నాథ్ డైలాగ్స్ కొంచెం ఇలాగే ఉండేవేమోన`ని నాగార్జున ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. `ఈ వీడియో అద్భుతంగా ఉంది సర్` అని కామెంట్ చేశారు.   
Updated Date - 2020-04-25T19:27:29+05:30 IST