జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్‌కు శంకుస్థాపన చేసిన నాగార్జున

ABN , First Publish Date - 2020-12-26T20:39:36+05:30 IST

హీరో నాగార్జున జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్ కోసం శంకుస్థాపన చేశారు.

జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్‌కు శంకుస్థాపన చేసిన నాగార్జున

మొన్నటి వరకు తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 4 హోస్ట్‌ చేస్తూ ఒకవైపు.. 'వైల్డ్‌ డాగ్‌' సినిమాను పూర్తి చేస్తూ మరో వైపు బిజీ బిజీగా పనిచేసిన నాగార్జున ఇప్పుడు కాస్త ఫ్రీ అయ్యారు. ఈ ఖాళీ సమయంలో ఆయన సామాజిక కార్యక్రమాలతో సమయం గడుపుతున్నారు. అందులో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్49లో ప్రత్యేకమైన మొక్కలు నాటారు. కాలనీ పచ్చదనంతో ఉండాలనే సదుద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమంలో వాల్గో ఇన్ ఫ్రా ఎండీ, సీఈఓ శ్రీధర్ రావుతో కలిసి పాల్గొన్నారు నాగార్జున. కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాదు.. జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్ కోసం శంకుస్థాపన చేశారు. తర్వాత కాలనీ వాసులతో మాట్లాడి చెట్లు పెంచుతున్న వాళ్ల నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. పచ్చదనం కోసం మరిన్ని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మన పరిసరాలను పచ్చదనంతో నింపుకోవడం మన బాధ్యత అంటూ తెలిపారు నాగార్జున. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులతో పాటు నాగార్జున స్నేహితుడు సతీష్ రెడ్డి, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-26T20:39:36+05:30 IST