నాగ్‌..గుడ్ బై టు 'వైల్డ్‌డాగ్‌'

ABN , First Publish Date - 2020-11-06T15:22:12+05:30 IST

ఎసీపీ విజయ్‌ వర్మగా నాగార్జున టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ హిమాలయాస్‌లో జరిగింది. దీంతో సినిమాలో నాగార్జున పార్ట్‌ చిత్రీకరణ పూర్తయ్యింది.

నాగ్‌..గుడ్ బై టు 'వైల్డ్‌డాగ్‌'

ఎసీపీ విజయ్‌ వర్మగా నాగార్జున టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ హిమాలయాస్‌లో జరిగింది. దీంతో సినిమాలో నాగార్జున పార్ట్‌ చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ విషయాన్ని నాగార్జున తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు."వైల్డ్‌డాగ్‌లో నా పాత్ర చిత్రీకరణ ఈరోజుతో పూర్తయ్యింది. ఇంటికి బయలుదేరాను. నా టాలెంటెడ్‌ టీమ్‌కు, హిమాలయాస్‌కు గుడ్‌బై చెబుతున్నందుకు చాలా బాధగా ఉంది"అని ట్వీట్‌తో పాటు కొన్ని ఫొటోలను నాగార్జున షేర్‌ చేశారు. ఆయన జోడీ దియామీర్జా నటిస్తున్నారు. కీలక పాత్రలో సయామీ ఖేర్‌ నటిస్తున్నారు. నూతన దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Updated Date - 2020-11-06T15:22:12+05:30 IST