నాగబాబుకి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-09-16T17:44:06+05:30 IST

మెగాబ్రదర్‌ నాగబాబు కరోనా వైరస్‌ ప్రభావానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ద్వారా తెలియచేశారు.

నాగబాబుకి కరోనా పాజిటివ్‌

కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టలేదు. ఇప్పుడు సినీ పరిశ్రమకు చెంది ప్రముఖులనను కూడా కరోనా వైరస్‌ టార్గెట్‌ చేసింది. టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు కోవిడ్‌ ప్రభావానికి గురైనవారే. రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి, ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం తదితరులు కోవిడ్‌ ప్రభావానికి గురైనవారే. ఇప్పుడు మెగాబ్రదర్‌ నాగబాబు కరోనా వైరస్‌  ప్రభావానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ద్వారా తెలియచేశారు. "ఇన్‌ఫెక్షన్‌ ఎల్లప్పుడూ మనల్ని బాధకు గురిచేయదు. దాన్ని ఇతరులకు సాయం చేసే అవకాశంగా మలుచుకోవాలి" అని అన్నారు నాగబాబు. తాను త్వరలోనే కోలుకుని ప్లాస్మా డోనర్‌గా మారుతానని ఆయన తెలిపారు. ఈ మధ్య నాగబాబు ఓ షోలో పాల్గొంటున్నారు. బహుశా అక్కడి నుండే ఆయనకు కరోనా సోకి ఉండవచ్చునని భావిస్తున్నారు. 
Updated Date - 2020-09-16T17:44:06+05:30 IST