కుమార్తె పెళ్లి గురించి నాగ‌బాబు స్పంద‌న‌

ABN , First Publish Date - 2020-07-03T16:55:28+05:30 IST

మెగా బ్రదర్ నాగబాబు తన కుమార్తె నిహారిక కొణిదెల వివాహం గురించి రీసెంట్ ఇంట‌ర్వ్యూలో స్పందించారు.

కుమార్తె పెళ్లి గురించి నాగ‌బాబు స్పంద‌న‌

మెగా బ్రదర్ నాగబాబు తన కుమార్తె నిహారిక కొణిదెల వివాహం గురించి రీసెంట్ ఇంట‌ర్వ్యూలో స్పందించారు. రీసెంట్‌గా చైత‌న్య‌, నిహారిక‌ల‌కు పెళ్లి చేయ‌డానికి ఇరు కుటుంబాల పెద్ద‌లు నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే. వీరి పెళ్లి గురించి ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో నాగ‌బాబు మాట్లాడుతూ నిహారిక పెళ్లి అనేది త‌మ కుటుంబానికి సంబంధించిన వ్య‌వ‌హార‌మ‌న్నారు. ఏదీ చేసిన ప్ర‌భుత్వ నిబంధ‌న‌లను పాటిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ఏదో హడావుడిగా, ఆర్భాటంగా చేసేయాల‌నుకోవ‌డం లేద‌ని తెలిపారు. అయితే సోష‌ల్ మీడియా వ‌ర్గాల స‌మాచారం మేర‌కు చైత‌న్య‌, జొన్న‌ల‌గ‌డ్డ నిశ్బితార్థం ఆగ‌స్ట్ 13న జ‌రిగే అవ‌కాశం ఉంది. పెళ్లి తేదీపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేద‌ట‌. 

Updated Date - 2020-07-03T16:55:28+05:30 IST