‘నర్తనశాల’ లాంటి సినిమాలు చేయను

ABN , First Publish Date - 2020-02-08T05:48:36+05:30 IST

‘‘శౌర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘అశ్వథ్థామ’ నిలిచినందుకు ఆనందంగా ఉంది. తన రచనా శైలి, నటన, ఫైట్లు ఆకట్టుకున్నాయని అందరూ చెబుతున్నారు...

‘నర్తనశాల’ లాంటి సినిమాలు చేయను

‘‘శౌర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘అశ్వథ్థామ’ నిలిచినందుకు ఆనందంగా ఉంది. తన రచనా శైలి, నటన, ఫైట్లు ఆకట్టుకున్నాయని అందరూ చెబుతున్నారు. మున్ముందు ఐరా క్రియేషన్స్‌లో ఇలాంటి మంచి చిత్రాలను తీసుకొస్తాం’’ అని ఉషా ముల్పూరి అన్నారు. నాగశౌర్య, మెహరీన్‌ జంటగా రమణ తేజ దర్శకత్వంలో ఉషా ముల్పూరి నిర్మించిన చిత్రం ‘అశ్వథ్థామ’. శుక్రవారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో రఈ సినిమా గాండ్‌ సక్సెస్‌ మీట్‌ జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘సినిమాకు మా టీమ్‌ బలం. అందరి కృషి వల్లే సినిమా విజయం సాధించింది. నాగశౌర్య నటనకు మంచి మార్కులు పడ్డాయి’’ అని అన్నారు. ‘‘సినిమాల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నా. నేను బాగా నమ్మి చేసిన సినిమా ఇది. ఇలాంటి కథను ప్రొడ్యూస్‌ చేసిన అమ్మకు థ్యాంక్స్‌. మరోసారి ‘నర్తనశాల’ లాంటి సినిమా చెయ్యను. రమణతేజకు సినిమా అంటే ప్రాణం. నా నమ్మకాన్ని తను నిలబెట్టాడు’’ అని నాగశౌర్య తెలిపారు. ‘‘విజువల్‌ ట్రీట్‌లాంటి సినిమా ఇది. నేను పనిచేసిన మంచి సినిమాల్లో ఇదొకటి’’ అని ప్రిన్స్‌ అన్నారు. ‘‘శౌర్య రాసిన కథలో ఇంటెన్స్‌ బావుంది. సెన్సిటివ్‌ సబ్జెక్ట్‌ను దర్శకుడు చక్కగా తెరకెక్కించారు. స్ర్కీన్‌ప్లే అమేజింగ్‌గా ఉంది. ఈ సినిమాతో శౌర్య యాక్షన్‌స్టార్‌గా గుర్తింపు పొందాడు’’ అని శరత్‌ మరార్‌ అన్నారు. నందినీరెడ్డి, 

బీవీఎస్‌ రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-08T05:48:36+05:30 IST