వరుడు కావలెను
ABN , First Publish Date - 2020-11-14T05:12:58+05:30 IST
నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రానికి ‘వరుడు కావలెను’ టైటిల్ ఖరారు చేసినట్టు చిత్రనిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలియజేసింది. దీపావళి సందర్భంగా టైటిల్ ప్రకటిస్తూ సినిమా టీజర్ విడుదల చేశారు....

నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రానికి ‘వరుడు కావలెను’ టైటిల్ ఖరారు చేసినట్టు చిత్రనిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలియజేసింది. దీపావళి సందర్భంగా టైటిల్ ప్రకటిస్తూ సినిమా టీజర్ విడుదల చేశారు. అందులో హీరో హీరోయిన్లు ఇద్దర్నీ పరిచయం చేశారు. నగలు అలంకరించుకుంటూ రీతూ వర్మ, మ్యాన్లీ లుక్‌తో నాగశౌర్య ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. నదియా, మురళీ శర్మ, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, సమర్పణ: పి.డి.వి. ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ.