డైరెక్టర్ సుకుమార్ ను నామినేట్ చేసిన నాగ చైతన్య

ABN , First Publish Date - 2020-08-07T19:22:38+05:30 IST

డైరెక్టర్ సుకుమార్ ను నామినేట్ చేస్తూ అక్కినేని నాగ చైతన్య ట్వీట్ చేశారు. ఇంత‌కూ సుకుమార్‌ను నాగ‌చైత‌న్య ఎందుకు నామినేట్ చేశారు. అనే విష‌యంలోకి వెళితే..

డైరెక్టర్ సుకుమార్ ను నామినేట్ చేసిన  నాగ చైతన్య

డైరెక్టర్ సుకుమార్ ను నామినేట్ చేస్తూ అక్కినేని నాగ చైతన్య ట్వీట్ చేశారు. ఇంత‌కూ సుకుమార్‌ను నాగ‌చైత‌న్య ఎందుకు నామినేట్ చేశారు. అనే విష‌యంలోకి వెళితే.. కరోనాతో పోరాటంలో విజేతలుగా నిలిచిన వారి అనుభవాలను ప్రజలకు వివరించే అవగాహన కార్యక్రమం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఈ కార్య‌క్రమంలో నాగ‌చైత‌న్య పాల్గొన్నారు. ఇప్పుడు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనాలంటూ నాగచైతన్య దర్శకుడు సుకుమార్‌ను నామినేట్ చేశారు. దర్శకుడు శేఖర్ కమ్ముల మొదలుపెట్టిన ఈ ప్రయత్నాన్ని కొనసాగించాలని సుకుమార్ ను కోరారు.


కరోనా వైరస్ భారినపడిన సామాన్యులు వైరస్‌ను ఎలా ఎదుర్కొని విజేతలుగా నిలిచారు? అనే విషయంపై శేఖర్ కమ్ముల ఫేస్ బుక్ వేదికగా ప్రత్యేక చర్చా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన తర్వాత చైతన్యను నామినేట్ చేశారు. అందులో భాగంగా చైతన్య కూడా పలువురు కొవిడ్ విజేతలో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. అనంతరం మరికొంత మంది విజేతల అనుభవాలను తెలుసుకోవడానికి ఈ ప్రయత్నంలో తదుపరి వ్యక్తిగా సుకుమార్‌ను నామినేట్ చేస్తున్నట్లు చైతన్య తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.Updated Date - 2020-08-07T19:22:38+05:30 IST