హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ తీయ‌కండి: నాగ‌బాబు

ABN , First Publish Date - 2020-05-25T12:37:54+05:30 IST

నాగ‌బాబు తాజాగా టీటీడీ ఆస్థుల‌ను అమ్మాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను విమర్శిస్తూ ట్వీట్ చేశారు.

హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ తీయ‌కండి:  నాగ‌బాబు

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు ట్విట్ట‌ర్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. రాజకీయంగా ఆయ‌న చేస్తున్న ట్వీట్స్ చ‌ర్చ‌కు దారి తీస్తుంది. నాథూరాం గాడ్సే, క‌రెన్సీపై గాంధీజీ ఫొటోనే ఎందుకు ఉండాలి? అనే అంశాల‌పై ఇటీవల ట్వీట్ చేసిన నాగ‌బాబు తాజాగా టీటీడీ ఆస్థుల‌ను అమ్మాలనుకుంటున్నతితిదే పాలకమండలి ఆలోచనను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ‘‘తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆస్థులని కాపాడే బాధ్యత తిరుపతి పాలకమండలిది. అంతే కాని స్వామివారి భూములను అమ్మే హక్కు మీకు లేదు..హిందువుల మనోభావాలని దెబ్బ తీయకండి.నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా.ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాను’’ అన్నారు నాగబాబు 


Updated Date - 2020-05-25T12:37:54+05:30 IST

Read more