థియేటర్స్‌ ఓపెన్‌ చేయండంటున్న ప్యాన్‌ ఇండియా డైరెక్టర్‌

ABN , First Publish Date - 2020-09-29T18:43:34+05:30 IST

బిగ్‌ స్క్రీన్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను మరచిపోలేకపోతున్నామని అంటున్నారు డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌.

థియేటర్స్‌ ఓపెన్‌ చేయండంటున్న ప్యాన్‌ ఇండియా డైరెక్టర్‌

బిగ్‌ స్క్రీన్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను మరచిపోలేకపోతున్నామని అంటున్నారు డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌. రీసెంట్‌గా సినిమా థియేటర్స్‌ను ఓపెన్‌ చేయమంటూ నాగ్‌ అశ్విన్‌ చేసిన ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతోంది. "జిమ్స్‌, బార్స్‌, రెస్టారెంట్స్‌, మాల్స్‌, గుళ్లు, బస్సులు, మెట్రో రైళ్లు, ఫ్లైట్స్..అన్నీ ఓపెన్‌ అయ్యాయి. ఇప్పుడు థియేటర్స్‌ ఓపెన్‌ చేసే సమయం వచ్చింది. మాస్క్‌ ధరించి సినిమాలు చూడటానికి వెయిట్‌ చేయలేకపోతున్నాను" అంటూ నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌ చేశారు. ప్రభుత్వం థియేటర్స్‌ ఓపెన్‌ చేయాలంటూ సినీ ఇండస్ట్రీ నుండి విజ్ఞప్తులు వెళుతున్న నేపథ్యంలో నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌కు మంచి స్పందన వస్తుంది. తొలి చిత్రం 'ఎవడే సుబ్రమణ్యం'తో డైరెక్టర్‌గా ప్రూవ్‌ చేసుకున్న నాగ్‌ అశ్విన్‌ రెండో చిత్రం 'మహానటి'తో జాతీయస్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు ప్రభాస్‌తో ప్యాన్‌ ఇండియా మూవీని అనౌన్స్‌ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 


Updated Date - 2020-09-29T18:43:34+05:30 IST