నాగ్ అశ్విన్, డాక్టర్ ఆనంద్ న్యాయ నిర్ణేతలుగా టాటా షార్ట్ ఫిల్మ్ పోటీలు

ABN , First Publish Date - 2020-07-03T21:00:39+05:30 IST

ప్రముఖ ఎన్ఆర్ఐ సంస్థ.. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(TATA) షార్ట్ ఫిల్మ్, మ్యూజిక్ వీడియోస్ కాంటెస్ట్‌ను నిర్వహించ తలపెట్టింది.

నాగ్ అశ్విన్, డాక్టర్ ఆనంద్ న్యాయ నిర్ణేతలుగా టాటా షార్ట్ ఫిల్మ్ పోటీలు

హైదరాబాద్: ప్రముఖ ఎన్ఆర్ఐ సంస్థ.. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(TATA) షార్ట్ ఫిల్మ్, మ్యూజిక్ వీడియోస్ కాంటెస్ట్‌ను నిర్వహించ తలపెట్టింది. ‘చిత్రం భళారే విచిత్రం’ పేరుతో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మకమైన కాంటెస్ట్‌కు న్యాయనిర్ణేతగా జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం ‘మహానటి’ దర్శకులు నాగ్ అశ్విన్ వ్యవహరించనున్నారు. ఆయనతో పాటు సామాజిక కార్యకర్త, లఘు చిత్రాల దర్శకులు డాక్టర్ ఆనంద్ మరో జడ్జీగా ఉన్నారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ అమెరికా తెలుగు సంఘం’ నిర్వాహకులు అశోక్ చింతకుంట, రమ కె వనమ, ఉష మన్నెం, దీప్తి రెడ్డి, నిత్యశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక ఇతివృత్తంతో 15 నిమిషాల నిడివిగల లఘు చిత్రాలను, 4 నిమిషాల నిడివి గల మ్యూజిక్ వీడియోలను తమకు ఈనెల 15వ తేదీలోగా పంపించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతిభ, ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. దరఖాస్తు చేసుకునే వారు ఇక్కడ క్లిక్ చేయగలరు. 


https://docs.google.com/forms/d/e/1FAIpQLSd0iL-NhgCueNMjMhahiRsOA1KuczFcSZw_VJcR9dXY4TpkSw/viewform

Updated Date - 2020-07-03T21:00:39+05:30 IST