ఇస్మార్ట్ భామ ఆ హీరోను ప్రేమించిందట!

ABN , First Publish Date - 2020-08-27T00:10:58+05:30 IST

`ఇస్మార్ట్ శంకర్` సినిమాతో తెలుగు నాట మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ నభా నటేష్.

ఇస్మార్ట్ భామ ఆ హీరోను ప్రేమించిందట!

`ఇస్మార్ట్ శంకర్` సినిమాతో తెలుగు నాట మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ నభా నటేష్. ప్రస్తుతం `సోలో బ్రతుకే సో బెటరు`తో పాటు మరిన్ని అవకాశాలను నభా తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నభా.. గతంలో తను ఇష్టపడిన హీరో గురించి మాట్లాడింది. 


`చిన్నప్పటి నుంచి నన్ను బాగా ఆకర్షించిన హీరో షారూక్ ఖాన్. బాల్యం నుంచి షారూక్ సినిమాలు చూసి ఆయనపై విపరీతమైన అభిమానం పెంచుకున్నా. `కుచ్‌ కుచ్‌ హోతా హై` ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. కాలేజ్ రోజుల్లో షారూక్‌ను ఎంతగానో ప్రేమించాన`ని నభా చెప్పింది. 


Updated Date - 2020-08-27T00:10:58+05:30 IST