‘నాంది’.. వరలక్ష్మీ శరత్‌కుమార్ లుక్ విడుదల

ABN , First Publish Date - 2020-06-29T02:11:49+05:30 IST

హీరో అల్ల‌రి న‌రేష్‌ త్వ‌ర‌లో ‘నాంది’ అనే విల‌క్ష‌ణ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోన్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్ట‌ర్‌ హ‌రీష్ శంక‌ర్ ద‌గ్గ‌ర కో-డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన

‘నాంది’.. వరలక్ష్మీ శరత్‌కుమార్ లుక్ విడుదల

హీరో అల్ల‌రి న‌రేష్‌ త్వ‌ర‌లో ‘నాంది’ అనే విల‌క్ష‌ణ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోన్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్ట‌ర్‌ హ‌రీష్ శంక‌ర్ ద‌గ్గ‌ర కో-డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంబంధించి లాక్‌డౌన్ విధించ‌క ముందే 80 శాతం షూటింగ్ పూర్త‌యింది. జూన్ 30 అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘నాంది ఎఫ్ఐఆర్’ (ఫ‌స్ట్ ఇంపాక్ట్ రివీల్‌) పేరిట ఒక చిన్న గ్లింప్స్‌ను విడుద‌ల చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో ఇతర పాత్రలు పోషిస్తున్న నటీనటులను పరిచయం చేస్తూ.. పోస్టర్స్ విడుదల చేశారు.


ఈ పోస్టర్స్‌లో హీరోయిన్‌గా నటిస్తున్న వరలక్ష్మీ శరత్‌కుమార్ లుక్ కూడా రివీల్ చేశారు. ఈ లుక్‌లో వరలక్ష్మీ శరత్‌కుమార్ నల్లకోటు చేతపట్టుకుని, మరో చేతిలో ఫైల్స్ పట్టుకుని ఠీవీగా నడిచొస్తుంది. ఈ చిత్రంలో వరలక్ష్మీ.. ఆధ్య పాత్రలో లాయర్‌గా నటిస్తున్నట్లుగా ప్రకటించారు. ఆమెతో పాటు ప్రియదర్శి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్ పాత్రలను కూడా చిత్రయూనిట్ రివీల్ చేసింది. ఇక ‘నాంది’ అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌లో ఆందోళ‌న నిండిన ముఖంతో జైలులో న‌గ్నంగా కనిపించిన అల్ల‌రి న‌రేష్, జూన్ 30న ఆయన బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుదల కాబోయే చిత్ర ఎఫ్‌ఐఆర్‌లో ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటాడో చూద్దాం.Updated Date - 2020-06-29T02:11:49+05:30 IST