డిస్కవరీ బుక్‌ ప్యాలెస్‌లో 'నా.ముత్తుకుమార్‌' రచనలు

ABN , First Publish Date - 2020-12-27T19:10:02+05:30 IST

దివంగత తమిళ సినీ గేయరచయిత నా. ముత్తుకుమార్‌ రచనలకు విస్తృత ప్రచారం కల్పించే దిశగా చెన్నై కేకేనగర్‌లోని డిస్కవరీ బుక్‌ప్యాలెస్‌ నిర్వాహకులు కాపీరైట్‌ హక్కులను పొందారు.

డిస్కవరీ బుక్‌ ప్యాలెస్‌లో 'నా.ముత్తుకుమార్‌' రచనలు

దివంగత తమిళ సినీ గేయరచయిత నా. ముత్తుకుమార్‌ రచనలకు విస్తృత ప్రచారం కల్పించే దిశగా చెన్నై కేకేనగర్‌లోని డిస్కవరీ బుక్‌ప్యాలెస్‌ నిర్వాహకులు కాపీరైట్‌ హక్కులను పొందారు. ఈ మేరకు ముత్తుకుమార్‌ నాలుగో వర్ధంతి సందర్భంగా చెన్నైలో ఏర్పాటైన ప్రత్యేక సభలో ఆయన రచనల కాపీరైట్‌ హక్కులను సంస్థ నిర్వాహకులు కుటుంబ సభ్యుల నుంచి స్వీకరించారు. ఇందుకు ప్రతిఫలంగా సంస్థ నిర్వాహకులు ముత్తుకుమార్‌ సతీమణి జీవా, కుమారుడు ఆదవన్‌ ముత్తుకుమార్‌కు రూ.2లక్షల చెక్కును  అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు ఏఎల్‌విజయ్‌, రచయిత అజయన్‌బాలా, న్యాయవాది సుమతి, డిస్కవరీ బుక్‌పాలెస్‌ డైరెక్టర్లు ఎం.వేడియప్పన్‌, శీనివాసన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T19:10:02+05:30 IST