`మైత్రీ మూవీ మేకర్స్` రూ.10 లక్షల విరాళం!

ABN , First Publish Date - 2020-10-21T03:15:26+05:30 IST

భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భాగ్యనగర వాసులను ఆదుకునేందుకు ఎంతో మంది సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు.

`మైత్రీ మూవీ మేకర్స్` రూ.10 లక్షల విరాళం!

భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భాగ్యనగర వాసులను ఆదుకునేందుకు ఎంతో మంది సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు తమ వంతు సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు. 


ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తన వంతు సహాయంగా రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించింది. `ఈ క్లిష్ట సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు మా వంతు సహాయంగా సీఎం సహాయ నిధికి రూ.10 లక్షలు అందిస్తున్నాం. మన నగరవాసులు క్షేమంగా ఉండాలని ప్రార్థనలు చేస్తున్నామ`ని ట్వీట్ చేసింది. 
Updated Date - 2020-10-21T03:15:26+05:30 IST