మా ఆయన పియానో నేర్పిస్తున్నాడు

ABN , First Publish Date - 2020-05-13T05:40:49+05:30 IST

కరోనా కారణంగా తారలంతా ఇప్పుడు ఇళ్లకే పరిమితమయ్యారు. సరదాగా వంటలు చేస్తోనో, కొత్త విషయాలు నేర్చుకుంటూనో కాలం గడిపేస్తున్నారు. ఇంతకాలం బిజీ వల్ల చూడలేని సినిమాలు వరుసపెట్టి చూసేస్తున్నారు...

మా ఆయన పియానో నేర్పిస్తున్నాడు

కరోనా కారణంగా తారలంతా ఇప్పుడు ఇళ్లకే పరిమితమయ్యారు. సరదాగా వంటలు చేస్తోనో, కొత్త విషయాలు నేర్చుకుంటూనో కాలం గడిపేస్తున్నారు. ఇంతకాలం బిజీ వల్ల చూడలేని సినిమాలు వరుసపెట్టి చూసేస్తున్నారు. ప్రియాంక మాత్రం పియానో నేర్చుకుంటోందట. ప్రస్తుతం లాస్‌ ఏంజెల్స్‌లో ఉంటున్న ప్రియాంకకు  ఆమె భర్త నిక్‌ జోనాస్‌ పియానో ఎలా ప్లే చెయ్యాలో నేర్పిస్తున్నాడట. ‘‘నాకు పియానో అంటే  చాలా ఇష్టం. ఇంతవరకూ ప్లే చేసే అవకాశం రాలేదు. నా ఇష్టాన్ని తెలుసుకొని మా ఆయన రోజూ ఓ గంట సేపు  నాకు పియానో నేర్పిస్తున్నారు. అలాగే డాన్స్‌ మిస్‌ అవుతున్నాననిపించి, హిపాప్‌ డాన్స్‌ కూడా నేర్చుకుంటున్నాను’ అని తెలిపారు ప్రియాంక. కరోనా కారణంగా రెండు నెలలుగా ఇంట్లోనే స్వీయ నిర్భందంలో  ప్రియాంక,  నిక్‌ ఉంటున్నారు. నిక్‌  డయాబెటిక్‌ కావడంతో  వెంటనే సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లామనీ, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నామని ప్రియాంక చెప్పారు. ఇద్దరూ కలసి ఒకే చోట ఉంటున్నందుకు ఆమె ఆనందం వ్యక్తం చేశారు. రెండు నెలల తర్వాత ఇంటి పనుల నిమిత్తం బయటకు అడుగుపెట్టానంటూ  ప్రియాంక  సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

Updated Date - 2020-05-13T05:40:49+05:30 IST