ముస్లిం పేరు, హిందూ ఇంటిపేరు.. నా పిల్లలకు అదే కరెక్ట్

ABN , First Publish Date - 2020-04-16T23:42:08+05:30 IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ ను హిందువైన ఆయుష్ శర్మ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ముస్లిం పేరు, హిందూ ఇంటిపేరు.. నా పిల్లలకు అదే కరెక్ట్

ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్‌ను హిందువైన ఆయుష్ శర్మ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారికి ఇద్దరు సంతానం. మరి వీరికి ఏ మతం ఆధారంగా పేర్లు పెడతారని అడగ్గా.. ఆయుష్ ఆసక్తికరమైన విషయం చెప్పారు. తాను సెక్యులర్ భావజాలం గల వ్యక్తినని, అందుకే తన పిల్లల పేర్లు తన భార్య మతం నుంచి పెట్టానని, ఇంటి పేరు మాత్రం తనది ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తన కొడుకు పేరు అహిల్ అని పెట్టడానికి గల కారణాన్ని వివరించారు. తాను లండన్‌లో ఉండగా అహిల్ అనే ఓ వ్యక్తిని కలిశానని, ఆ పేరు తనను ఆకట్టుకుందని, దాని అర్థం తెలుసుకోగా నిజమైన రాజు(పర్షియన్‌లో) అని తెలిసిందని, అందుకే తన కొడుక్కి ఆ పెరు పెట్టానని చెప్పారు. ప్రస్తుతం క్వారంటైన్ కారణంగా ఇంట్లోనే ఉండడంతో కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నానని, తండ్రిగా పిల్లల బాధ్యతను నెరవేరుస్తున్నానని ఆయుష్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-04-16T23:42:08+05:30 IST

Read more