‘మిస్టర్ లోన్లీ’ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

ABN , First Publish Date - 2020-07-12T21:13:52+05:30 IST

ఎస్.కె.ఎమ్.ఎల్ మోషన్ పిక్చర్స్ నేతృత్వంలో రూపొందుతున్నచిత్రం ‘మిస్ట‌ర్ లోన్లీ’. డైరెక్ట‌ర్ ముక్కి హ‌రీశ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో కాండ్రేగుల ఆది నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్ట‌ర్‌ను విశాఖ పార్ల‌మెంట్ స‌భ్యుడు, సినీ నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ ఆవిష్కరించారు.

‘మిస్టర్ లోన్లీ’ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

ఎస్.కె.ఎమ్.ఎల్ మోషన్ పిక్చర్స్ నేతృత్వంలో రూపొందుతున్నచిత్రం ‘మిస్ట‌ర్ లోన్లీ’. డైరెక్ట‌ర్ ముక్కి హ‌రీశ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో కాండ్రేగుల ఆది నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్ట‌ర్‌ను విశాఖ పార్ల‌మెంట్ స‌భ్యుడు, సినీ నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ  ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా పార్ల‌మెంట్ స‌భ్యుడు ఎం.వి.వి.సత్యనారాయణ చిత్ర యూనిట్‌ను అభినందించి సినిమా ఘ‌న విజ‌యం సాధించాల‌ని కోరారు. ‘యువతను ఆకట్టుకునే కథతో, కాలేజ్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ  చిత్రం అన్ని వర్గాల ప్రజలను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు విశేషమైన ఆదరణ లభించింది’ అన్నారు. దర్శకుడు హరీశ్ కుమార్, కెమెరామెన్ గారా, నటీనటులు విక్కీ, , కియారెడ్డి , సోనాలి వర్ధమ్, లోహిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2020-07-12T21:13:52+05:30 IST