నటుడు మురళీశర్మకి మాతృ వియోగం

ABN , First Publish Date - 2020-06-08T20:59:17+05:30 IST

సినీ నటుడు మురళీ శర్మ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి శ్రీమతి పద్మ శర్మ ఆకస్మికంగా మృతి చెందారు. మురళీ శర్మ మాతృమూర్తి శ్రీమతి పద్మ శర్మ

నటుడు మురళీశర్మకి మాతృ వియోగం

సినీ నటుడు మురళీ శర్మ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి శ్రీమతి పద్మ శర్మ ఆకస్మికంగా మృతి చెందారు. మురళీ శర్మ మాతృమూర్తి శ్రీమతి పద్మ శర్మ ఆదివారం రాత్రి ముంబైలోని స్వగృహంలో గుండె పోటుతో మృతి చెందినట్లుగా ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆమె వయస్సు 76 సంవత్సరాలు. దీంతో మురళి శర్మ కుటుంబానికి పలువురు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. విలన్‌గా, తండ్రిగా, పోలీస్ ఆఫీసర్‌గా ఇలా విభిన్న పాత్రల్లో మెప్పిస్తున్న తెలుగు నటుడు మురళీ శర్మ ఇటీవల వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని వాల్మీకి పాత్రతో మంచి గుర్తింపును పొందిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-06-08T20:59:17+05:30 IST