నటి రేఖ కరోనా టెస్టు చేయించుకోవాలి.. మేయర్ డిమాండ్!

ABN , First Publish Date - 2020-07-19T02:58:39+05:30 IST

అభిమానుల కోసం బాలీవుడ్ నటి రేఖ కరోనా టెస్టు చేయించుకోవాలని ముంబై మేయర్ కోరారు.

నటి రేఖ కరోనా టెస్టు చేయించుకోవాలి.. మేయర్ డిమాండ్!

ముంబై: అభిమానుల కోసం బాలీవుడ్ నటి రేఖ కరోనా టెస్టు చేయించుకోవాలని ముంబై మేయర్ కోరారు. ఈ మేరకు కిషోరీ పడ్నేకర్ డిమాండ్ చేశారు. రేఖకు సంబంధించిన బంగ్లాలో సెక్యూరిటీ గార్డుకు కరోనా సోకింది. అతన్ని కలిసిన చుట్టుపక్కల బంగ్లాల సెక్యూరిటీ సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు తేలింది. అలాగే రేఖ ఇంట్లో పనిచేసే ఇద్దరు పనివాళ్లకు కూడా ఈ వైరస్ సోకింది. ఈ క్రమంలో అభిమానులంతా రేఖ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారని పడ్నేకర్ పేర్కొన్నారు. ‘వ్యాధి లక్షణాలు ఉన్నా లేకున్నా రేఖ.. కరోనా టెస్టు చేయించుకోవాలి. స్వాబ్ టెస్టు చేయించుకోకుండా ఆమె తప్పించుకోలేదు. ఎందుకంటే ఈ వైరస్ విషయంలో వయసు ప్రధాన అంశం’ అని ఆయన చెప్పారు.

Updated Date - 2020-07-19T02:58:39+05:30 IST