‘ఒక్కడు’ సీక్వెల్‌పై నిర్మాత ఫోకస్.. డైరెక్టర్ ఎవరు?
ABN , First Publish Date - 2020-12-15T02:43:00+05:30 IST
ఎందుకో టాలీవుడ్‌లో సీక్వెల్స్ అనగానే.. హిట్ కావు అనే పేరు పడిపోయింది. అందుకు కారణాలు లేకపోలేదు.. సీక్వెల్ అని చెప్పి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అందుకు ఉదాహరణ

ఎందుకో టాలీవుడ్‌లో సీక్వెల్స్ అనగానే.. హిట్ కావు అనే పేరు పడిపోయింది. అందుకు కారణాలు లేకపోలేదు.. సీక్వెల్ అని చెప్పి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అందుకు ఉదాహరణ 'సర్ధార్ గబ్బర్‌సింగ్' చిత్రమే. దీంతో టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాకి సీక్వెల్ చేయడం అంటే కత్తి మీద సామే. దర్శకనిర్మాతలు పులి నోట్లో తలపెట్టినట్టే. మంటల్లోకి దూకినట్టే. ప్రజెంట్ ఇలాంటి సాహసానికే రెడీ అవుతున్నాడు ఎం.ఎస్.రాజు. ఆయన మహేష్‌తో 'ఒక్కడు' సీక్వెల్ నిర్మించేందుకు రెడీ అవుతున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
'ఒక్కడు' సినిమా గురించి చెప్పుకోవాలంటే... టాలీవుడ్‌లో మహేష్ కెరీర్‌ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా ఇది. గ్యాంగ్ వార్, రాయలసీమ ఫ్యాక్షనిజం, సెన్సిబుల్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. మాస్ హీరోగా మహేష్ పేరు మారుమోగిపోయింది. ఇదే సినిమాని తమిళంలో విజయ్, త్రిష జంటగా 'గిల్లి' పేరుతో రీమేక్ చేస్తే అక్కడా భారీ విజయాన్ని అందుకుంది. కన్నడలో 'అజయ్ 'గా, బెంగాలీలో 'జోర్' గా, హిందీలో 'తేవర్' గా రీమేక్ చేస్తే పెట్టిన పెట్టుబడిని రాబడిగా మార్చింది. ఇక ఈ సినిమా సీక్వెల్ పై గత కొంత కాలంగా కామెంట్స్ వస్తున్నా లైట్ తీసుకున్న మహేష్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్ డేట్ ఇవ్వబోతున్నాడట ఎం.ఎస్.రాజు. ఆయన ప్రస్తుతం దర్శకత్వం వహించిన 'డర్టీ హరి' రిలీజ్ తర్వాత 'ఒక్కడు' సీక్వెల్‌పై ఫోకస్ పెట్టబోతున్నాడట. తన సొంత బ్యానర్ 'సుమంత్ ఆర్ట్స్' లో కొంతకాలంగా సైలెంట్‌గా ఉంచుతున్న రాజు.. 'ఒక్కడు' సీక్వెల్‌తో ఘనంగా రీ లాంచ్ చేయబోతున్నాడట.
అయితే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు..? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. అప్పట్లో ' ఒక్కడు' సినిమాని డైరెక్ట్ చేసిన గుణశేఖర్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలైన 'శాకుంతలం' ,' హిరణ్య కస్యప'లతో బిజీగా ఉన్నారు. వాటిని వదిలి గుణశేఖర్ ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేసే ఛాన్స్ లేదు. టాలీవుడ్‌లోని స్టార్ డైరెక్టర్స్ అందరూ 3,4 సినిమాలకు కమిటై ఉన్నారు. ఎం.ఎస్.రాజు సొంతంగా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తాను అంటే మహేష్ ఒప్పుకోక పోవచ్చు. అందుకే, ఎం.ఎస్.రాజు ఎవరితో 'ఒక్కడు' సీక్వెల్ తెరకెక్కిస్తాడు అనేది తెలియాలంటే.. ముందు ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చాల్సి ఉంది. ఎం.ఎస్. రాజు స్ర్కిప్ట్ రెడీ చేసి, దానిని మహేష్‌కి చెప్పి, ఒప్పించాల్సి ఉంది. ప్రస్తుతం మహేష్‌ను ఒప్పించడమంటే మాములు విషయం కాదు. మరి ఎలా ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళుతుందో చూద్దాం.