ఓటీటీలో మరో మూడు చిత్రాలు

ABN , First Publish Date - 2020-06-16T14:56:00+05:30 IST

లాక్‌డౌన్‌ 70 రోజులకు పైగా కొనసాగుతుండటంతో పలు తమిళ చిత్రాలు అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓటీటీ చానెళ్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఓటీటీలో మరో మూడు  చిత్రాలు

లాక్‌డౌన్‌ 70 రోజులకు పైగా కొనసాగుతుండటంతో పలు తమిళ చిత్రాలు అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓటీటీ చానెళ్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదివరకే జ్యోతిక నటించిన ‘పొన్‌మగళ్‌ వందాల్‌’ చిత్రం ఆమెజాన్‌ ప్రైమ్‌లో ప్రదర్శింపబడి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత కళైఅరసన్‌ రూపొందించిన ‘టైటానిక్‌ - కాదులమ్‌ కడందుపోగుమ్‌, అంధకారం చిత్రాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. తాజాగా జేఎస్కే ఫిలిమ్స్‌ సంస్థ నిర్మించిన ‘అండావై కానోమ్‌’, ‘వాడిల్‌’, ‘మమ్మీ సేవ్‌’ చిత్రాలు ఓటీటీలో విడుదల చేయనున్నట్లు నిర్మాత జేఎస్‌కే సతీష్‌కుమార్‌  ట్విట్టర్‌లో ప్రకటించారు. ‘వాడిల్‌’ చిత్రంలో యువనటుడు అరుణ్‌ విజయ్‌, కార్తీకా నాయర్‌ జంటగా నటించారు. ‘అండావై కానోమ్‌’ చిత్రంలో శ్రియారెడ్డి కీలకమైన పాత్రలో నటించారు.

Updated Date - 2020-06-16T14:56:00+05:30 IST