మదర్స్ డే స్పెషల్: ఆడవేషంలో సాయితేజ్

ABN , First Publish Date - 2020-05-11T05:27:14+05:30 IST

మదర్స్ డే స్పెష‌ల్‌గా హీరో సాయి తేజ్ పోస్ట్ చేసిన పిక్ వైరల్ అవుతుంది. ఇంతకీ పిక్ ఏంటి అనుకుంటున్నారు. ఆడవేషంలో ఉన్న తన చిన్నప్పటి ఫొటో

మదర్స్ డే స్పెషల్: ఆడవేషంలో సాయితేజ్

మదర్స్ డే స్పెష‌ల్‌గా హీరో సాయి తేజ్ పోస్ట్ చేసిన పిక్ వైరల్ అవుతుంది. ఇంతకీ పిక్ ఏంటి అనుకుంటున్నారు. ఆడవేషంలో ఉన్న తన చిన్నప్పటి ఫొటో. ఈ ఫొటోలో తను ఆడవేషంలో ఉండగా వాళ్ల అమ్మ ఎత్తుకుని ఎంతో ఆనందిస్తున్నారు. ఈ ఫొటో పోస్ట్ చేసిన సాయితేజ్ ఏమని అన్నారో తెలుసా? అసలు ఎంతకు అమ్మలంతా తమ కొడుకులకు చిన్నప్పుడు ఆడవేషాలు వేస్తారో ఇప్పటికీ అర్థం కాలేదంటున్నారు సాయితేజ్.


‘‘మదర్స్ అందరూ తమ కొడుకుల విషయంలో ఇలా ఎందుకు చేస్తారో నాకిప్పటి వరకు అర్థం కాలేదు. కొడుకులు చిన్నగా ఉన్నప్పుడు ఆడవాళ్ల బట్టలు వేసి ఇలా ఎందుకు తయారు చేస్తారనేది. బహుశా ఒక మహిళగా ఉండడం ఎంత కష్టమో మనకు తెలియడానికి అనుకుంటా.. లేదా వారి త్యాగాలను మనం గుర్తించాలని అలా చేస్తారేమో? మన మహిళలను ప్రేమించండి, రక్షించండి మరియు గౌరవించండి. మన అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు..’’ అని సాయితేజ్ తన పోస్ట్‌లో తెలిపారు.Updated Date - 2020-05-11T05:27:14+05:30 IST