‘ఓదెల రైల్వేస్టేష‌న్’ను ప్రకృతి ఆశీర్వదించింది

ABN , First Publish Date - 2020-10-09T03:57:35+05:30 IST

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బేన‌ర్‌లో `ఏమైంది ఈవేళ`‌, `బెంగాల్ టైగ‌ర్` వంటి సూప‌ర్‌హిట్‌ చిత్రాల‌ను అందించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది క‌థ‌

‘ఓదెల రైల్వేస్టేష‌న్’ను ప్రకృతి ఆశీర్వదించింది

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బేన‌ర్‌లో `ఏమైంది ఈవేళ`‌, `బెంగాల్ టైగ‌ర్` వంటి సూప‌ర్‌హిట్‌ చిత్రాల‌ను అందించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో  శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాత‌ కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ `ఓదెల రైల్వేస్టేష‌న్`. ఈ చిత్రం ద్వారా అశోక్ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. విశేషం ఏమిటంటే.. 'ఓదెల' అనేది సంపత్‌ నంది సొంత ఊరి పేరు. మొద‌టిసారి ఈ చిత్రం ఫుల్ రియ‌లెస్టిక్ అప్రోచ్‌తో తెరకెక్కుతున్నట్లుగా చిత్ర నిర్మాత కె.కె. రాధామోహన్‌ ఇప్పటికే తెలిపి ఉన్నారు. అంటే మేక‌ప్‌, డిఫ‌రెంట్ కాస్ట్యూమ్స్, డ్రీమ్ సీక్వెన్సెస్‌, సాంగ్స్ లాంటి ఎలిమెంట్స్ ఏమీ లేకుండా పూర్తి న్యాచురాలిటీతో ఈ చిత్రాన్ని దర్శకుడు అశోక్‌ తేజ తెర‌కెక్కిస్తున్నారు. `ఓదెల‌`అనే గ్రామంలో జ‌రిగిన సంఘ‌ట‌న ఆధారంగా ఒక‌ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.


తాజాగా ఈ చిత్రయూనిట్‌ ఓ ఆసక్తికర విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేసింది. ''టీమ్‌ `ఓదెల రైల్వేస్టేష‌న్` రైన్‌ ఎఫెక్ట్ కావాలని కోరుకుందో లేదో.. ప్రకృతి ఆశీర్వదించి వర్షం కురిపించింది. పాజిటివ్‌ వైబ్స్‌తో మా టీమ్‌లో ఆనందం నెలకొంది. వర్షంలో చిత్రయూనిట్‌ చిత్రీకరణ జరిపిన సందర్భంగా యూనిట్‌ మొత్తానికి అభినందనలు తెలియజేస్తున్నాము.." అని నిర్మాత కె.కె. రాధామోహన్‌, అలాగే దర్శకుడు సంపత్‌ నంది ట్వీట్స్ చేశారు.







Updated Date - 2020-10-09T03:57:35+05:30 IST