'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' టీజర్‌ రిలీజ్‌

ABN , First Publish Date - 2020-10-25T17:25:51+05:30 IST

దసరా సందర్భంగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' టీజర్ ను విడుదల చేశారు.

'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' టీజర్‌ రిలీజ్‌

'మీ వైవాహిక జీవితం నుండి మీరేం ఆశిస్తున్నారు' అని ఓ అబ్బాయి తనకు కాబోయే అమ్మాయిని ప్రశ్నిస్తే 

కేరింగ్ హస్బెండ్‌..

అన్నీ పనులు షేర్‌ చేసుకోవాలి...

నాకు జాయింట్‌ ఫ్యామలీ అంటే చిరాకు...

లవ్‌ లవ్‌ లవ్‌ లవ్‌ లవ్‌..

ఇంకేముంటుందండి మ్యారీడ్‌ లైఫ్‌లో అంటూ అమ్మాయిలు సమాధానాలు చెబితే.. ఆ అబ్బాయి ఎలా రియాక్ట్‌ అవుతాడు.. అలాంటి అబ్బాయికి 'నాకు కాబోయే వాడు నా షూస్‌తో సమానం' అని చెప్పే ఓ అమ్మాయి దొరికితే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే 2021 సంక్రాంతి వరకు ఆగాల్సిందేనని అంటున్నారు 'మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' మేకర్స్‌. అఖిల్‌ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏపిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసువర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సన్నద్ధమవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 
Updated Date - 2020-10-25T17:25:51+05:30 IST

Read more